చిల్లీ గోబి

ABN , First Publish Date - 2022-04-15T18:57:11+05:30 IST

గోబి పువ్వు- ఒకటి, మైదా పిండి- కప్పు, మొక్కజొన్న పిండి- నాలుగు స్పూన్లు, కారం- స్పూను

చిల్లీ గోబి

కావలసిన పదార్థాలు: గోబి పువ్వు- ఒకటి, మైదా పిండి- కప్పు, మొక్కజొన్న పిండి- నాలుగు స్పూన్లు, కారం- స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, సోయా సాస్‌- రెండు స్పూన్లు, చిల్లీ సాస్‌- స్పూను, ఉల్లికాడలు- అర కప్పు, క్యాప్సికమ్‌- ఒకటి, అల్లం, వెల్లుల్లి ముక్కలు- స్పూను, పచ్చి మిర్చి- మూడు, నీళ్లు, నూనె, ఉప్పు- తగినంత, చక్కెర - స్పూను.


తయారుచేసే విధానం: గోబిని చిన్న పువ్వులుగా కత్తిరించుకుని వేడినీళ్లలో ఉడికించి పక్కన పెట్టాలి. పచ్చి మిర్చి, ఉల్లికాడలు, క్యాప్సికమ్‌ పొడుగ్గా కట్‌ చేసుకోవాలి. గిన్నెలో మైదా, మొక్క జొన్న పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్‌, చిల్లిసాస్‌ వేసి కలపాలి. కప్పు నీళ్లను జతచేసి పిండిలా చేసుకోవాలి. ఇందులో గోబి పువ్వుల్ని ముంచి పుణుగుల్లా నూనెలో వేయించుకోవాలి. పాన్‌లో కాస్త నూనె వేసి ఉల్లికాడలు, క్యాప్సికమ్‌, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయించాలి. ఉల్లిరంగు మారాక మంట తగ్గించి సోయా, చిల్లీ సాస్‌ జతచేయాలి. వేయించిన గోబీ పువ్వుల్ని కూడా వేసి కాసేపు మగ్గిస్తే చిల్లీ గోబి రెడీ. పైన మిరియాల పొడి చల్లితే సరి.

Updated Date - 2022-04-15T18:57:11+05:30 IST