ఛోలే గుత్తి వంకాయ
ABN , First Publish Date - 2022-05-20T17:28:43+05:30 IST
పెద్ద వంకాయలు- రెండు, ఉప్పు, ఆలివ్ ఆయిల్- తగినంత, కొత్తిమీర పొడి- అరస్పూను, మసాలా - ముప్పావు స్పూను, ఉడికించిన ఛోలే శనగలు- కప్పు, టొమాటో ముక్కలు
కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయలు- రెండు, ఉప్పు, ఆలివ్ ఆయిల్- తగినంత, కొత్తిమీర పొడి- అరస్పూను, మసాలా - ముప్పావు స్పూను, ఉడికించిన ఛోలే శనగలు- కప్పు, టొమాటో ముక్కలు- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- అర కప్పు, మిరియాల పొడి- అర స్పూను, టొమాటో పేస్టు - స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా వంకాయల్ని నిలువుగా కట్ చేయాలి. సన్నని కత్తితో ఒక్కో భాగం లోపలి గుజ్జును ముక్కలుగా కోసి, ఉప్పుపూసి పక్కన పెట్టాలి. అరగంట తరవాత నీటిని తొలగించి, పేపరుతో తుడవాలి. వంకాయ ముక్కలపై ఆలివ్ నూనెను రాసి ఓవెన్‌లో 45 నిమిషాల పాటు బేక్ చేయలి. పాన్‌లో నూనె వేసి ఉల్లి, మిరియాల పొడి, మసాలా పొడి, టొమాటో పేస్టు, ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తరవాత టొమాటో ముక్కలు, ఛోలే శనగలు, ఉప్పు, నీళ్లు వేసి పది నిమిషాలు ఉడికించి ఈ మసాలా చల్లబడే వరకు పక్కనపెట్టాలి. ఆ తరవాత స్పూనుతో ఈ మసాలాను వంకాయ ముక్కల మీద దట్టించాలి. పైన కొత్తిమీర తరుగు చల్లితే సరి.