మామిడికాయ - పెరుగు పులుసు

ABN , First Publish Date - 2022-04-30T17:20:20+05:30 IST

పుల్లని పెరుగు - ఒక కప్పు, మామిడికాయ - ఒకటి, పసుపు - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొబ్బరితురుము - ఒకకప్పు, మెంతులు - అరటీస్పూన్‌, ఎండుమిర్చి -

మామిడికాయ - పెరుగు పులుసు

కావలసినవి: పుల్లని పెరుగు - ఒక కప్పు, మామిడికాయ - ఒకటి, పసుపు - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి  తగినంత, కొబ్బరితురుము - ఒకకప్పు, మెంతులు - అరటీస్పూన్‌, ఎండుమిర్చి - ఐదు, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఒకరెమ్మ. 


తయారీ విధానం: మామిడికాయ పొట్టు తీయాలి. తరువాత వేడి నీటిలో వేసి ఉడకబెట్టాలి. తరువాత మామిడితో పాటు కొబ్బరితురుము వేసి మిక్సీలో పట్టుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పెరుగు వేయాలి. మిక్సీలో వేసి పట్టుకున్న మామిడికాయ మిశ్రమం వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని దింపుకోవాలి.


Updated Date - 2022-04-30T17:20:20+05:30 IST