మురుకులు

ABN , First Publish Date - 2022-02-05T19:09:04+05:30 IST

అన్నం - మూడు కప్పులు, సగ్గుబియ్యం - ఒక కప్పు, నిమ్మరసం - మూడు టీస్పూన్లు, పెరుగు - రెండు టీస్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూను.

మురుకులు

కావలసినవి: అన్నం - మూడు కప్పులు, సగ్గుబియ్యం - ఒక కప్పు, నిమ్మరసం - మూడు టీస్పూన్లు, పెరుగు - రెండు టీస్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూను.


తయారీ విధానం: అన్నం, సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో పెరుగు, మిరియాల పొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో పెట్టి ఒత్తుకోవాలి.కరకరలాడేలా వేయించుకుంటే ఈ మురుకులు రుచిగా ఉంటాయి.

Updated Date - 2022-02-05T19:09:04+05:30 IST