పకోడీలు

ABN , First Publish Date - 2022-02-05T18:45:36+05:30 IST

వేడి వేడి ఆహారం తినాలి. కానీ అన్నం మిగిలిపోతే పడేయడానికి మనసొప్పదు. అలాంటప్పుడు ఆ అన్నంతో ఇలా స్నాక్స్‌ చేస్తే సరి. మిగిలిపోయిన

పకోడీలు

మిగిలిన అన్నంతో స్నాక్స్‌

వేడి వేడి ఆహారం తినాలి. కానీ అన్నం మిగిలిపోతే పడేయడానికి మనసొప్పదు. అలాంటప్పుడు ఆ అన్నంతో ఇలా స్నాక్స్‌ చేస్తే సరి. మిగిలిపోయిన అన్నంతో మురుకులు వేసుకోవచ్చు. వడియాలు పెట్టుకోవచ్చు. పకోడీలు, పునుగులు, కట్‌లెట్‌లు వేసుకుని లాగించొచ్చు. ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. వాటి తయారీ విశేషాలు ఇవి..


కావలసినవి: అన్నం - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - ఒక రెమ్మ, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర - ఒక స్పూను, అల్లం పేస్టు - ఒక స్పూను, శనగపిండి - నాలుగు స్పూన్లు, బియ్యప్పిండి - రెండు స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - డీప్‌ ఫ్రైకి తగినంత.


తయారీ విధానం: ముందుగా మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. తరువాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, తగినంత ఉప్పు వేసి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం పేస్టు, తరిగిన పచ్చిమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి.స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె పోసి వేడి అయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీలు వేసుకోవాలి.సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్స్‌గా ఈ పకోడీలను సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-02-05T18:45:36+05:30 IST