వడలు
ABN , First Publish Date - 2022-03-05T18:07:29+05:30 IST
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉల్లి దోశ, సాంబారు ఇడ్లీ అంటే ఎవ్వరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈ సారి సగ్గుబియ్యంతో వడలు వేసుకోండి. సాబుదానా బోండాలను ఒక్కసారి రుచి
సగ్గు బియ్యంతో స్పెషల్‌గా...
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉల్లి దోశ, సాంబారు ఇడ్లీ అంటే ఎవ్వరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈ సారి సగ్గుబియ్యంతో వడలు వేసుకోండి. సాబుదానా బోండాలను ఒక్కసారి రుచి చూస్తే మీ బ్రేక్‌ఫాస్ట్ మెనూలో అవి రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా సగ్గుబియ్యంతో దోశలు, థాలీ పీట్, పాపడ్ వంటివి చేసుకోవచ్చు. వాటి తయారీ విశేషాలు ఈ వారం మీకోసం...
కావలసినవి: సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, బంగాళదుంపలు - రెండు, పంచదార - అర టీస్పూన్, పల్లీలు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - మూడు, కొత్తిమీర- ఒక కట్ట, నిమ్మరసం - అర టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకుని పొట్టు తీసేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల బౌల్‌లో సగ్గుబియ్యం, పల్లీల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడలుగా ఒత్తుకోవాలి. తరువాత కొద్దిసేపు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వడలు వేసి వేయించాలి. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.