సోయా కర్రీ
ABN , First Publish Date - 2022-05-21T18:36:53+05:30 IST
సోయా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయలు - రెండు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, పచ్చిమిర్చి - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు
కావలసినవి: సోయా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయలు - రెండు, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, పచ్చిమిర్చి - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, ధనియాల పొడి - అర టీస్పూన్, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, టొమాటోలు - రెండు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ఒక పాత్రలో మూడు కప్పుల నీళ్లు పోసి మరుగుతున్న సమయంలో సోయా బాల్స్ వేయాలి. కాసేపయ్యాక బయటకు తీసి చల్లటి నీళ్లలో వేయాలి. తరువాత చేత్తో పిండి నీరంతా తీసేయాలి.ఇప్పుడు టొమాటోలు, కొబ్బరి తురుము మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి.పాన్ స్టవ్‌పై పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.ఇంగువ వేయాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. కాసేపు వేగిన తరువాత టొమాటో పేస్టు వేయాలి. కారం, గరంమసాల, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సోయా వేసి కలియబెట్టుకోవాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోయాలి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించుకుని దింపుకోవాలి.