సోయా కబాబ్స్
ABN , First Publish Date - 2022-05-21T23:10:36+05:30 IST
సోయా గింజలు - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - అరకప్పు,
కావలసినవి: సోయా గింజలు - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, ధనియాల పొడి - ఒక టీస్పూన్, గరంమసాల - అర టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, మిరియాలపొడి - అర టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా.
తయారీ విధానం: సోయా గింజలను అరగంట పాటు నానబెట్టుకోవాలి. బంగాళదుంపలను, పచ్చిబఠాణీలను ఉడికించుకోవాలి.తరువాత వాటిని ఒక బౌల్‌లో తీసుకుని కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరంమసాల, మిరియాలపొడి, శనగపిండి, తరిగిన ఉల్లిపాయ, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి.ఈ మిశ్రమాన్ని సమానభాగాలుగా చేసి పుల్లలకు గుచ్చాలి. గ్రిల్ పాన్‌పై కొద్దిగా నూనె వేసి తిప్పుకొంటూ కాల్చుకుంటే కబాబ్‌లు రెడీ.