20 వేల టన్నులే కొన్నారు
ABN , First Publish Date - 2023-05-08T00:26:07+05:30 IST
కాకినాడ జిల్లాలో 2 లక్షల 60 వేల టన్నుల ధాన్యం అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు ఆర్‌బీకేల ద్వారా కేవలం 20 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, మళ్లీ చంద్రబాబు జిల్లాకు వచ్చేలోగా మిగిలిన ఽధాన్యం కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు.
కాకినాడ సిటీ, మే 7: కాకినాడ జిల్లాలో 2 లక్షల 60 వేల టన్నుల ధాన్యం అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు ఆర్‌బీకేల ద్వారా కేవలం 20 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, మళ్లీ చంద్రబాబు జిల్లాకు వచ్చేలోగా మిగిలిన ఽధాన్యం కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం మొద్దు నిద్రలో ఉంటే చంద్రబాబు పర్యటనతో అధికార యంత్రాంగం కళ్లు తెరిచిందన్నారు. మూడు జిల్లాలకు చంద్రబాబు రావడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. రైతును బాధపెట్టే కేంద్రాలుగా ఆర్‌బీకే కేంద్రాలు తయారయ్యాయన్నారు. మళ్లీ చంద్రబాబు ఈ నెల 12న జిల్లాకు వస్తున్నారని, ఈ లోపు ధాన్యం కొనుగోలు చేయకపోతే ధర్నా చేస్తామన్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్న 7 లక్షల 60 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తామే కొనుగోలు చేసేలా చేస్తామని అధికారులను హెచ్చరించారు. తక్షణం ఫీల్డ్ కెళ్లి ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లు జగన్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది కానున్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలులో డిలే ప్రోసెస్ జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎత్తుగడ అని, ధాన్యం కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆర్‌బీకేల ఆంక్షలు, దళారుల దోపిడీతో ధాన్యం కొనుగోళ్లలో రూ.70, 80 కోట్ల స్కామ్ జరిగిందని గతంలోనే కలెక్టర్‌కు చెప్పామన్నారు. ఈ సీజన్‌లోను అదే తంతు నడపాలని ఎత్తుగడ వేస్తున్నారన్నారు. చంద్రబాబును ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్న ఓ మంత్రి, మరో మాజీ మంత్రికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని వర్మ చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, అల్లుమల్లు విజయకుమార్ పాల్గొన్నారు.