Home » East Godavari
విద్యుదాఘాతంతో ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా, పాడేరు మండలంలో బలమైన మెరుపు తగిలి ఈ విషాదం చోటు చేసుకుంది.
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
Pharmacist Death: లైగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి కథ విషాదంగా ముగిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫార్మాసిస్ట్ కన్నుమూసింది.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రేమ వివాహం చేసుకున్న శివను, కుటుంబ కలహాల నేపథ్యంలో అతని బావమరిది, మామ, మరికొందరు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. భోజనం చేస్తుండగా వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోసి హత్య చేశారు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. తూర్పు
Harassment Of Women: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు పెను సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.
పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు.
ఏలూరు వద్ద జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒకే సమయంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున ఏలూరు శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. మరో ఘటనలో..