Nara Brahmani: బ్రాహ్మణితో బుడ్డోడు చిలక పలుకులు.. ఏం మాట్లాడాడంటే..!

ABN , First Publish Date - 2023-09-16T04:13:16+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌లో భాగంగా తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి స్థానిక విద్యానగరంలో

Nara Brahmani: బ్రాహ్మణితో బుడ్డోడు చిలక పలుకులు.. ఏం మాట్లాడాడంటే..!

  • చిలక పలుకులతో లోకేశ్‌కు అభినందనలు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 15: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌లో భాగంగా తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి (Nara Brahmin) స్థానిక విద్యానగరంలో బసచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్‌ (Lokesh) శిబిరంలోకి శుక్రవారం నాలుగేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి బ్రాహ్మణిని కలిశాడు. వచ్చీరాని మాటలతో ఆమెను అబ్బురపరిచాడు. 2024లో చంద్రబాబు సీఎం అయ్యే వరకు తాను పోరాడతానన్నాడు. యువగళం యాత్రలో లోకేశ్‌.. తన కాళ్లకు బొబ్పలు వచ్చినా పట్టించుకోకుండా తన కుటుంబానికి దూరంగా ఉండి ముందుకు సాగారని, ఆయనకు తన హృదయపూర్వక అభినందనలని అన్నాడు. బాలుడు చిలక పలుకులకు బ్రాహ్మణి.. సో నైస్‌.. థ్యాంక్యూ అంటూ అభినందించారు.

Updated Date - 2023-09-16T10:12:32+05:30 IST