1,336 కోట్లతో వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలు
ABN , First Publish Date - 2023-06-10T04:38:58+05:30 IST
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పంట ఉత్పత్తులు పెంచడం, యాంత్రీకరణ మెరుగుదల కోసం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, క్రిషోన్నతి యోజన పథకాల కింద 2023-24లో రూ.1,336కోట్లతో ...
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పంట ఉత్పత్తులు పెంచడం, యాంత్రీకరణ మెరుగుదల కోసం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, క్రిషోన్నతి యోజన పథకాల కింద 2023-24లో రూ.1,336కోట్లతో కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించింది. శుక్రవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ హరికిషన్, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆర్‌కేవీవై కింద కిసాన్ డ్రోన్, ఉపకరణాలు, అపరాలు, నూనె గింజల ఉత్పత్తి కార్యక్రమాలకు రూ.676 కోట్లు, మార్క్‌ఫెడ్, ఉద్యాన శాఖ, సీడ్ సర్టిఫికేషన్, డైరీ డెవల్‌పమెంట్, అగ్రి వర్సిటీ కార్యక్రమాలకు రూ.179 కోట్లు, క్రిషోన్నతి యోజన కింద రూ.480కోట్లతో ఆహారభద్రత, నాణ్యమైన విత్తనాలు, ఆయిల్‌పామ్, సమగ్ర ఉద్యాన అభివృద్ధి వంటి పథకాలను చేపట్టేందుకు ఈ ప్రణాళికల ఆమోదానికి కేంద్రానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.