యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దాం: టీడీపీ
ABN , First Publish Date - 2023-03-25T23:53:18+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని ఆపార్టీ నా యకులు పిలుపునిచ్చారు. పాదయాత్ర ఆదివారం పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు
పెనుకొండ, మార్చి 25: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని ఆపార్టీ నా యకులు పిలుపునిచ్చారు. పాదయాత్ర ఆదివారం పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు. గోరం ట్ల మండలం నుంచి ప్రారంభమయ్యే యాత్రకు నియోజకవర్గం నుంచి నా యకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. శనివారం పెను కొండలోని టీడీపీ కార్యాలయంలో యువగళం పాదయాత్ర కార్యాచరణ ప్ర ణాళికపై బీకే నాయకులతో చర్చించారు. ప్రతి పంచాయతీ నుంచి భారీ ఎ త్తున ప్రజలు హాజరై గోరంట్లలోని గుమ్మయ్యగారిపల్లి వద్ద నిర్వహించే లో కేశ బహిరంగసభకు తరలిరావాలన్నారు. పెనుకొండలో నిర్వహించే పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్నారు. అనంతరం పెనుకొండలో యువగళం పాదయాత్ర బృందానికి వసతి సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిమడుగు వెంకటరాముడు, కేశవయ్య, పోతిరెడ్డి, గుట్టూరు నాగరాజు, సుబ్బరాయుడు, రఘువీరచౌదరి, రామలింగ, లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీనివాసులు, సిద్దయ్య, సప్తగిరి, వీజీపా ళ్యం శీన, తోటగేరి శీన, కన్నాస్వామి, బాబుల్‌రెడ్డి, నరేంద్ర, నారాయణనాయక్, దోణి లక్ష్మీనారాయణ, రవిశంకర్, వెంకటేశ పాల్గొన్నారు.
బహిరంగ సభాస్థలం పరిశీలన
గోరంట్ల: యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ సోమవారం మ ధ్యాహ్నం గోరంట్ల బహిరంగసభలో ప్రసంగించనున్నారు. సభాస్థలం ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు పార్థసారథి శనివారం పరిశీలించారు. పాదయాత్ర లో భోజనం చేసే ప్రాంతం, రాత్రి బసచేసే స్థలాలలో అవసరమైన ఏర్పాట్ల కోసం పార్టీ నాయకులతో చర్చించారు. అనంతరం మండలంలోని పూలచెట్లపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీరామస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ వేడుకలకు బీకే హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశ్వర్థరె డ్డి, రామ్మోహనచౌదరి, లక్ష్మీనారాయణ, నరహరి, కొత్తపల్లి నరసింహప్ప, మనోహర్, హరీ్‌షరెడ్డి, ఉమర్‌ఖాన, సుబ్బరాయుడు, ఉత్తప్ప, మునీంద్ర, మంజునాథ్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, ఆదెప్ప పాల్గొన్నారు.
పాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించిన అబ్జర్వర్
నారా లోకేశ యువగళం పాదయాత్ర ఏర్పాట్లను అబ్జర్వర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు శనివారం పర్యవేక్షించారు. గోరంట్లలో సో మవారం జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లపై సమీక్షించారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి గోరంట్లలోని పట్టుపరిశ్రమ కార్యాలయం సమీపంలో జరిగే భహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరంమండల పార్టీ అధ్యక్షుడు సోమశేఖర్ నివాసంలో మండల ప్రముఖ నాయకులతో సమావేశం నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తలు, ప్రజలకు సదుపాయాల గురించి పార్టీశ్రేణులతో చర్చించారు. మండలంలో జరిగే 3 రోజుల పాదయాత్రను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
భారీగా జనం తరలిరావాలి
పెనుకొండ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారలోకేశ బహిరంగ సభకు జనం భారీగా తరలిరావాలని ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శి సవిత పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ఆమె పట్టణంలోని ఆమె క్యాం పు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర ఆదివారం మఽ ద్యాహ్నం 3 గంటలకు పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి గ్రామంలోకి ప్రవేశిస్తుందన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కు టుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలకాలన్నారు. సోమవారం గోరంట్లలోని గుమ్మయ్యగారి పల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో ఐదు రో జుల పాటు జరిగే పాదయాత్రలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు వెంట నడవాలన్నారు. సమావేశంలో నాయకులు గుట్టూరు సూరి, శ్రీరాములు, ఈశ్వర్‌ప్రసాద్, త్రివేంద్రనాయుడు, వాసుదేవరెడ్డి, మణికంఠ పాల్గొన్నారు.
విద్యార్థులు, యువత పాలుపంచుకోవాలి : టీఎనఎ్‌సఎ్‌ఫ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ చేపట్టిన పాదయా త్రకు విద్యార్థులు, యువత తరలివచ్చి సంఘీభావం తెలపాలని టీఎన ఎస్‌ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలకాలన్నారు. శనివారం టీఎనఎ్‌సఎఫ్ నాయకులు పార్థుయాదవ్, సాయికిరణ్, హరీష్, షబ్బీర్‌బాషా, నరేష్, ఇ మ్రాన పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జ గన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, యువత, ఉద్యోగులను మోసం చేశారన్నారు. యువనేత నారాలోకేశ పాదయాత్రలో విద్యార్థులు, ని రుద్యోగులు, ఉద్యోగస్థులు, యువతకు టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చి, ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరు యువగళం పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
రొద్దం: ప్రతి కార్యకర్త, నాయకుడు టీడీపీ బలోపేతానికి కృషిచేయాలని పెనుకొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బుగ్గయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఆర్ మరువపల్లి బీకే స్వగృహంలో మండల నా యకులు, కార్యకర్తలతో నారాలోకేశ పాదయాత్రపై ఆయన సమీక్షించారు. ఈనెల 27న పాదయాత్ర గోరంట్ల మండలంలో ప్రవేశిస్తుందని, ప్రతి కార్యకర్త పెద్దఎత్తున జనాన్ని తరలివచ్చేందుకు కృషిచేయాలన్నారు. తెలుగుదే శం పార్టీకి బలం పుంజుకుని, ఎల్లలు దాటే సమయం దగ్గరలో ఉందని అన్నారు. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, పార్టీ కోసం అహర్నిశలు కృషిచేయాలన్నారు. ప్రతి గ్రామం నుంచి వందలాది మంది తరలివచ్చేందుకు స్థానిక నాయకులు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జీవీపీ నాయుడు, చిన్నప్పయ్య, నరసింహులు, పవనకుమార్, నరహరి, ఇమాం, అశ్వర్థనారాయణ, చంద్రశేఖర్, అక్బర్, గంగాధర్, రాజప్ప పాల్గొన్నారు.
మడకశిరటౌన: నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న తెలిపారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి విజయానికి సహకరించిన పట్టభద్రులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం యువగళం పాదయాత్రకు 50 వా హనాల్లో తరలిపోతామన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని, స్వచ్ఛందంగా యువగళం పాదయాత్రలో ప్ర జలు పాల్గొని జయప్రదం చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
అగళి: గోరంట్ల మండలం గుమ్మయ్యవారిపల్లిలో ఈనెల 27న మధ్యా హ్నం జరిగే నారా లోకేశ బహిరంగకు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని జడ్పీటీసీ ఉమేష్, మండల కన్వీన ర్ కుమారస్వామి తెలిపారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
పరిగి: నారాలోకేశ యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామ ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ పిలుపునిచ్చారు. శనివా రం మండలంలోని క్లస్టర్ ఇనచార్జిలు, మండల కన్వీనర్, సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పెనుకొండ నియోజకవర్గంలో యువ గళం పాదయాత్ర అడుగు పెడుతున్న సందర్బంగా పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీన ర్ లక్ష్మీరెడ్డి, ఈశ్వరప్ప, హనుమయ్య, చౌడప్ప, ఆనంద్ పాల్గొన్నారు.