AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2023-05-20T12:06:42+05:30 IST

ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. పీఆర్సీ సహా అనేక విషయాలను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు పిలుపునిచ్చారు.

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

విజయవాడ: ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. పీఆర్సీ సహా అనేక విషయాలను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది కానీ... పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వారు దాచుకున్న సొమ్మే ప్రభుత్వం వాడేసుకోడం ఏంటని ప్రశ్నించారు. పీఆర్సీ సహా చాలా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 22 నుంచి ఈ కార్యాచరణ మొదలు అవుతుందని అన్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఈ ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సహా వేర్వేరు శాఖల ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణలో పాలుపంచుకుంటారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని.. ఇక సమ్మెకు దిగడం మినహా తమకు మరో గత్యంతరం కనిపించడం లేదని తెలిపారు. మే 22 నుంచి ఉద్యోగులంతా ఉద్యమ బాట పట్టాలని ఆస్కారరావు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-05-20T12:06:42+05:30 IST