ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు

ABN , First Publish Date - 2023-06-04T03:47:49+05:30 IST

ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు

ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు

విజయవాడ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడిటేషన్‌ పొందిందని సంస్థ పరిశోధన అధికారి, ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సి.మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యాలయంలో 1980లో ఔట్‌ పేపెంట్‌ విభాగాన్ని ప్రారంభించి, 1981లో 10 పడకల ఇన్‌పెషేంట్‌ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. 2009లో జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ వెక్టర్‌ బోర్న్‌ డిసీజె్‌సగా అప్‌గ్రేడ్‌ చేశారని వెల్లడించారు. 2016లో చర్మ సంబంధిత రుగ్మతలకు చికిత్సల కోసం ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థగా మార్చి, ఇన్‌పేషెంట్‌ పడకలు 10 నుంచి 25కి పెంచారన్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, పంచకర్మ విభాగాలు, లాబొరేటరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడిటేషన్‌ కోసం డైరెక్టర్‌ జనరల్‌ రబీ నారాయణ్‌ ఆచార్య మార్గదర్శకాలు ఉపయుక్తమయ్యాయని తెలిపారు.

Updated Date - 2023-06-04T03:47:49+05:30 IST