Home » andhrajyothy
ఇంటి కోసమో, పిల్లల కోసమో, గార్డెన్ కోసమో కాకుండా... పెంపుడు జంతువుల కోసం కూడా అనేక గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఉదాహరణకు వాటి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలన్నా, అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసు కోవాలన్నా ఇకపై క్షణాల్లో పనే.
జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా పర్యటించి, తరించవలసిన యాత్ర ‘చార్ధామ్’. కష్టసాధ్యమైనా, ఎంతటి ప్రయాస అయినా ఈ యాత్ర పూర్తి చేసేవారిది పూర్వజన్మ సుకృతమే! హిమాలయాల్లో నెలకొన్న నాలుగు అపురూప పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్, బదరీనాథ్. వీటిని దర్శించడమే చార్ధామ్ యాత్ర...
సత్తువుంది... మేధస్సుంది... అయినా ఆటను మధ్యలోనే ఆపారు. అది కూడా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) గేమ్‌లో మూడున్నర లక్షల రూపాయలు గెలుచుకున్నాక... హెల్ప్లైన్లు ఉన్నప్పటికీ అనూహ్యంగా ‘క్విట్’ అయ్యారు. ఆయన నిర్ణయానికి ‘బిగ్‌బీ’ అమితాబ్ ఆశ్చర్యపోయారు... ఆనక అభినందించారు. ఆ కంటెస్టెంట్ పేరు డాక్టర్ నీరజ్ సక్సేనా. ఎవరీయన? ఏమా కథ...
భూమి పెడ్నేకర్... చేసే పాత్రల కన్నా, ధరించే దుస్తులతోనే అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఒక స్టార్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తనను తాను ఎప్పుడూ సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘తను ధరించే దుస్తులే తనేమిటో చెప్తాయ’నే ఈ బోల్డ్ బ్యూటీ ఫ్యాషన్ మంత్ర ఏమిటంటే...
అధిక దిగుబడుల కోసం పంటలు పండించేప్పుడు రసాయనాలు, పురుగుమందుల వాడకం అధికమైంది. అవి లేని ఆహారం దొరకడం కష్టంగా ఉంటోంది. అటువంటప్పుడు రసాయనాలు, పురుగుమందుల వలన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
‘‘... వడ లామువడ లొబ్బట్లు సారసత్తులు సేవలుఁ జిరిమిళ్లు సరడాలుఁ బరిడగవ్వలు. జాపట్లు...’’ అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతి కావ్యంలో విష్ణుదాసు తన పరివారంతో అనేక వంటకాలను బళ్లకెత్తుకుని దూరప్రయాణానికి బయల్దేరినట్టు వివరిం చాడు. వాటిలో 100కి పైగా వంటకాలున్నాయి. ‘‘వడ లావడవడ లొబ్బట్లు చిరిమిళ్లు సరడాలు బండగవ్వలు జాపట్టు’’ లంటూ జైమిని భార తంలో పినవీరభద్రుడిని అనుసరించి హంస వింశతిలో ఈ పట్టిక రాసినట్టు కనిపిస్తోంది!
‘‘చణ్యతే దీయతే ఇతి చణక:’’ ‘చణ’ అంటే, ఇవ్వబడినది అని! శ్రావణమాసంలో ముత్తైదువలు వాయనంగా శనగలు, పండు, భక్ష్యాలు ఒక పళ్ళెంలో పెట్టి ఇస్తినమ్మా వాయనం అని ఇస్తే, పుచ్చుకొంటినమ్మా వాయనం అని పుచ్చుకుంటారు. మానవ సంబంధాలు పెంచేవి శనగలు.
సోషల్ మీడియాలో మీమ్స్, కామెడీ సీన్స్‌లో, యువతరం మాటల్లో, యూట్యూబర్ల వ్లాగుల్లో, చిన్నపిల్లల ఊత పదాల్లో ఇప్పుడు ఓ డైలాగ్ మార్మోగిపోతోంది. ఇన్‌స్టా రీల్స్, ఎక్స్ పోస్టులనే బ్రేక్ చేస్తోంది. ఆ డైలాగ్... ‘చీన్ టపాక్ డమ్ డమ్’. ప్రసిద్ధ కార్టూన్ సిరీస్ ‘చోటా భీమ్’ నాలుగో సీజన్లో మాంత్రికుడు అనే ఈ డైలాగ్ వెనుక విశేషాలే ఇవి...
దోసిళ్లలో నీళ్లను బంధించడం ఎంత కష్టమో.. ఈ రోజుల్లో డబ్బును నిలబెట్టుకోవడం అంత కష్టం. అందుకే వచ్చినట్లే వచ్చి మాయమైపోయే మాయదారి డబ్బు కోసమే ఈ పరుగు. ప్రస్తుత ప్రపంచంలో మనుగడే సవాలుగా మారడంతో.. పొదుపు చేస్తే తప్ప భవిష్యత్తు లేదన్న భయం పట్టుకుంది.
తెలంగాణ ప్రాంతం నుంచి మరింత విరివిగా కథా సాహిత్యం రావాల్సి ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ ఆకాంక్షించారు.