AP News: పవన్ ఫ్లెక్సీకి పూలదండ వేస్తుండగా పోలీసుల అడ్డగింపు

ABN , First Publish Date - 2023-05-10T17:25:16+05:30 IST

జిల్లాలోని పి గన్నవరం మండలం పప్పుల వారి పాలెంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

AP News: పవన్ ఫ్లెక్సీకి పూలదండ వేస్తుండగా పోలీసుల అడ్డగింపు

అంబేద్కర్ కోనసీమ: జిల్లాలోని పి గన్నవరం మండలం పప్పుల వారి పాలెంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawankalyan) రైతులను పరామర్శించేందుకు రానున్న నేపథ్యంలో.. పప్పులవారిపాలెం సెంటర్‌లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పూలదండ వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పూలదండ వేసేందుకు అనుమతి కావాలంటూ అడ్డుకున్న పోలీసులతో సైనికులు వాగ్వాదానికి దిగారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే ఆయన పర్యటించే మండలాల్లో పవర్ కట్ చేశారంటూ జనసైనికులు నిరసనకు దిగారు. దాంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-05-10T17:25:16+05:30 IST