AP News: మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యలపై లక్ష్మీదేవి ఆగ్రహం

ABN , First Publish Date - 2023-01-09T12:50:16+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యలపై శివచరణ్రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యలపై లక్ష్మీదేవి ఆగ్రహం

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యలపై శివచరణ్రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలం తనతో కలిసి ఉండి.. ఇప్పుడిలా మాట్లాడుతున్నారని లక్ష్మీదేవి మండిపడ్డారు. 18 ఏళ్ల నుంచి తనను, మా అబ్బాయిని పట్టించుకోలేదన్నారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇల్లు కట్టివ్వమని అడిగినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. సీఎంను కలవాల్సిందిగా మేకపాటికి పిలుపు వచ్చినట్లు పార్టీలో చర్చలు జరిగాయన్నారు.

Updated Date - 2023-01-09T12:50:18+05:30 IST