జగన్‌ సంపాదన వెనుక కిటుకు చెప్పాలి: ఆనంద్‌బాబు

ABN , First Publish Date - 2023-04-14T04:32:00+05:30 IST

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ పేదవాడినని బీద పలుకులు పలకడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు.

జగన్‌ సంపాదన వెనుక కిటుకు చెప్పాలి: ఆనంద్‌బాబు

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ పేదవాడినని బీద పలుకులు పలకడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బెంగుళూరులో భారీ రాజభవనం, హైదరాబాద్‌లో మరో పెద్ద ఇల్లు, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లిలో ప్యాలె్‌సలు ఉన్న జగన్‌ పేదవాడా? మరి ఎన్నికల అఫిడవిట్లలో 2009-2019వరకు జగన్‌ సంపాదన వందల కోట్లకు ఎలా పెరిగింది’ అని నిలదీశారు. తన సంపాదన వెనకున్న కిటుకు పేదలకు చెప్పి, రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని కోరారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు రూ.77.39 కోట్లు అని ఇచ్చిన జగన్‌ 2011 ఉప ఎన్నికలలో రూ.413కోట్లు అని పేర్కొన్నారని, రెండేళ్లలోనే రూ.368కోట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.510 కోట్లు చూపాడని, ఏటేటా ఆస్తిపాస్తులు ఎలా పెరిగాయని నిలదీశారు.

Updated Date - 2023-04-14T04:32:01+05:30 IST