Viveka Murder case : వివేకా హత్య కేసులో మరో అనుమానితుడికి సీబీఐ నోటీసులు, అవినాశ్‌తో పాటు విచారణ
ABN , First Publish Date - 2023-06-10T22:44:47+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కేసులో మరో అనుమానితుడికి సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. జమ్మలమడుగు వైసీపీ నేత ఋషికేశవరెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. శనివారం నాడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy)తో పాటు ఋషికేశవరెడ్డిని సీబీఐ విచారించింది. అవినాశ్ కాల్ డేటాలో ఆయన పేరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఋషికేశవరెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది.
కాగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం భాస్కర్ రెడ్ది ప్రయత్నించగా.. బెయిల్ పిటిషన్‍ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా తీర్పు వెల్లడించింది. కేసు కీలక దశలో ఉన్నందునా వైఎస్ భాస్కర్ రెడ్డి YS Bhaskar Reddy కి బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.