AP Govt Employees: ఏపీఎస్‌ఈఏ చీఫ్ వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం
ABN , First Publish Date - 2023-10-13T14:41:08+05:30 IST
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి (APSEA Chief Venkatramireddy) ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో వివిధ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యగులు ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోంటున్నారని.. వాటిలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదించి ఆమోదించిన జీపీఎస్ ఉద్యోగులకు పెద్ద అడ్డంకి మారిందన్నారు. జీపీఎస్ ద్వారా రిటైర్మెంట్ సమయంలోఇవ్వజూపిన బెనిఫిట్స్ లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. ఉద్యోగులు సమస్యలపై చర్చించడానికి ఇదే సరైన సమయమని అన్నారు. ముఖ్యంగా అతిముఖ్యమైన సీపీఎస్ ఉద్యోగుల సమస్యపైనా చర్చిచాల్సి ఉందని ఉద్యోగులు తెలిపారు. వెంటనే జనరల్ బాడీ మీటింగ్‌ను ఉద్యోగ సమస్యలపై నిర్వహించాలని కోరుతూ అధ్యక్షుడికి సంతకాలు చేసి లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం గతంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు ఈ సమావేశాన్ని నిర్వహించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు.