సైకిలే ఎలక్ట్రిక్ బైక్..
ABN , First Publish Date - 2023-01-22T03:13:14+05:30 IST
అసలే పెరిగి పోయిన పెట్రోల్ ధరలు.. ఆపైన ఊరూరా తిరిగి సమోసాలు అమ్ముకునే వృత్తి.. దీంతో వచ్చే సొమ్మంతా పెట్రోల్‌కే ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
మద్దికెర, జనవరి 21: అసలే పెరిగి పోయిన పెట్రోల్ ధరలు.. ఆపైన ఊరూరా తిరిగి సమోసాలు అమ్ముకునే వృత్తి.. దీంతో వచ్చే సొమ్మంతా పెట్రోల్‌కే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ సమస్య నుంచి వచ్చిన ఆలో చనతోనే ఆ యువకుడు సైకిల్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి గ్రామానికి చెందిన యల్లాల శ్రీరాములు బైక్‌పై ఊరూరా తిరుగుతూ సమోసాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో రూ.15 వేలు పెట్టి ఎలక్ర్టిక్ మోటార్, ఎక్సలేటర్, బ్యాటరీ తదితరాలు కొన్నాడు. వాటిని తన సైకిల్‌కు అమర్చి ఎలక్ట్రిక్ బైక్‌లా చేసుకున్నాడు. బ్రేకులు మాత్రం సైకిల్‌కు ఉన్నవాటినే ఉపయోగిస్తున్నాడు. శ్రీరాములుకు వెల్డింగ్ పనిలో కూడా అనుభవం ఉండడంతో ఇది సులభమైంది. సైకిల్‌కు అమర్చిన బ్యాటరీకి 6 గంటల పాటు చార్జింగ్ పెట్టుకుంటే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని శ్రీరాములు చెబుతున్నాడు.