ఏపీపీఎస్సీ సభ్యురాలిగా బీఎస్ సెలీనా
ABN , First Publish Date - 2023-05-02T02:20:23+05:30 IST
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలిగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ బీఎస్ సెలీనా నియమితులయ్యారు
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలిగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ బీఎస్ సెలీనా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలివ్వగా చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. త్వరలో ఏపీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేళ్లపాటు ఆమె ఏపీపీఎస్సీ సభ్యురాలిగా ఉంటారు.