Chandrababu: మా దరిద్రం జగనే

ABN , First Publish Date - 2023-02-17T02:59:16+05:30 IST

‘జగన్‌రెడ్డి రక్తం రుచిమరిగిన పులిలా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం పాలన చేస్తున్నాడు. ఇలాంటి దోపిడీదారును నా ఇన్నే ళ్ల జీవితంలో చూడలేదు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి.. చివరకు జనం ము ఖాన కూడా రంగులు పూస్తున్నాడు.

 Chandrababu: మా దరిద్రం జగనే

స్టిక్కర్లతో వస్తే ఇదే చెప్పండి: చంద్రబాబు

వైసీపీ.. రాష్ట్రానికి పట్టిన శని.. కులమతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు

ఓటుకు రూ.5-10 వేలివ్వడానికి డబ్బులు స్టాకు పెట్టాడు

బాబాయిని చంపించి నాపై నెట్టాడు.. రక్తం రుచి మరిగిన రాక్షసుడు

ఇష్టం వచ్చినట్లు పాలించడానికి రాష్ట్రం ఆయన అబ్బ సొత్తు కాదు

ఎన్ని చేసినా ఆయన ఇంటికి పోవడం ఖాయం

పెద్దాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు

Untitled-6.jpg

కాకినాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి):ఇంతా చేసి ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ఇంటింటికీ స్టిక్కర్లు వేయడానికి వస్తున్నాడు. అలా వస్తే ‘మా దరిద్రం నువ్వే జగన్‌’ అని ప్రతి ఒక్కరూ చెప్పాలి’ అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిగా అభివర్ణించారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రా ష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేసేశాడని విరుచుకుపడ్డా రు. కాకినాడలో రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు. అనంతరం జె.తిమ్మాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దాపురం వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పెద్దాపురం బహిరంగ సభ లో ప్రసంగించారు. తర్వాత సామర్లకోట వరకు రోడ్‌ షో చేపట్టారు. ఆయా సందర్భాల్లో సీఎం జగన్‌ తీరు పై చంద్రబాబు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో పేదలు, ధనికులకు మధ్య పోరాటమని జగన్‌ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని.. వాస్తవానికి దేశంలో ఆయనంత సంపన్నుడైన ముఖ్యమంత్రే లేరని చెప్పారు. ‘రూ.373 కోట్ల ఆస్తులున్నట్లు 2019 ఎన్నికల అఫిడవిట్‌లో చూపించాడు. పాత అఫిడవిట్‌ ప్రకారమే అంత ధనికుడైన జగన్‌.. ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతూ నాటకాలాడుతున్నాడు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాడు.

రాబోయే ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వడానికి ఇప్పటి నుంచే డబ్బులు స్టాకు పెట్టాడు. అలాంటి వ్యక్తి పేదల గురిం చి మాట్లాడడమా? బాబాయిని చంపించి నాపై నెట్టేశాడు. రక్తం రుచి మరిగిన రాక్షసుడు. జనం నెత్తిన 48 రకాల పన్నులు మోపిన ఘరానా దొంగ. ఇంతచేసి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి జగనన్నా.. మా నమ్మకం నువ్వే అంటూ స్టిక్కర్లు వేస్తారంట. అలా వస్తే జనం బుద్ధిచెప్పాలి. ఇష్టం వచ్చినట్లు పరిపాలించడానికి రాష్ట్రం జగన్‌ అబ్బ సొత్తు కాదు’ అని స్పష్టం చేశారు. జీవో నంబర్‌ 1తో తనను కట్టడి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని అన్నారు. ఒకప్పుడు తాను ఎన్జీవోలకు భయపడేవాడినని.. కానీ ఇప్పుడు వారే జగన్‌కు భయపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే..

9babu-peddapuram.jpg

రాజధాని ఆస్తులను కరిగించేశాడు..

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతిచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక జగన్‌ తన అసలు రూపం బయటపెట్టాడు. 3 రాజధానుల పేరుతో నాటకాలు ఆడాడు. కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఢిల్లీ వెళ్లి విశాఖ రాజధాని అని ప్రకటించాడు. రూ.3.50 లక్షల కోట్ల అమరావతి ఆస్తులను కరిగించేశాడు. ఇటీవల కేంద్రం కూడా రాజధానిపై స్పష్టంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. విభజన చట్టం ప్రకారం, అప్పటి రాష్ట్రప్రభుత్వ ఆమోదంతో రాజధాని గా అమరావతిని ఎంపిక చేసినట్లు చెప్పింది. పదో తరగతి ఫెయిలైన ఆయన.. పదో తరగతి పాస్‌ అయితేనే పెళ్లికానుక పథకం ఇస్తాననడం దారుణం. జగన్‌ నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి. కోడికత్తి కమల్‌ హాసన్‌. ఇలాంటి వ్యక్తి ఎక్కడా లేరు. సీఎం నివాసానికి అతి సమీపంలో ఓ మూగ యువతిపై అత్యాచారం చేసి చంపేస్తే కనీసం జగన్‌ సమీక్ష నిర్వహించలేదు. ఇలాం టి ఘటనలపై ఉక్కుపాదం మోపాల్సింది పోయి నిద్రమత్తులో ఉన్నాడు. టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లలోకి జనం వాక్‌ ఇన్‌ చేస్తే ఇప్పుడు మద్యం వాక్‌ ఇన్‌ స్టోర్లలోకి అడుగుపెట్టాల్సి వస్తోంది. జగన్‌ పేరు చెబితే రాష్ట్రానికి ఎవరూ రావడం లేదు.. పిక్‌పాకెటర్లు, పేటీఏం బ్యాచ్‌లే వస్తున్నాయి. టీడీపీ అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా అయితే.. వైసీపీ అరాచకాలకు అడ్ర్‌సగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికార యంత్రాంగం, రౌడీలను ఉపయోగించి ప్రజాభిప్రాయాన్ని మార్చాలనుకుంటున్నాడు.

9babu-(3).jpg

ప్రైవేటు ఆస్తులూ కబ్జా..

వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల రక్తం తాగేస్తున్నారు. సహజ వనరులను, ప్రైవేటు ఆస్తులనూ కబ్జా చేసేస్తున్నారు. విశాఖలో లలితేశ్‌ అనే ఎన్‌ఆర్‌ఐ భూమిని లాగేసుకున్నారు. విశాఖలో ఎందరినో బెదిరించి భూములు లాక్కున్నారు. భూములను 21ఏలోకి చేర్చారు. రూ.40 వేల కోట్ల ఆస్తుల కబ్జాకు ప్రణాళికలు వేశారు. కాకినాడ పోర్టులో వాటా లాగేసుకున్నారు.

తోడుదొంగల గూడుపుఠాణీ..

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రేషన్‌ బియ్యాన్ని చౌకగా కొని ఆఫ్రికా దేశాలకు ముఖ్యంగా ఐవరీకో్‌స్టకు ఎగుమతి చేస్తూ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నాడు. అక్కడ గోదాములు కూడా కట్టాడు. ద్వారంపూడి తండ్రి సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌.. ఓ సోదరుడు జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు. వీరంతా తోడు దొంగలు.

9babu-(2).jpg

ఎడ్లబండి ఎక్కి..

చంద్రబాబు గురువారం ఉదయం జగ్గంపేట లో.. రాజస్థాన్‌ నుంచి తీసుకొచ్చిన బాహుబలి ఎడ్ల బండి ఎక్కి కాసేపు సవారీ చేశారు. కాట్రావులపల్లిలో కూరగాయల రైతు అడబాల శ్రీనుతో మాట్లాడారు. పెద్దాపురం మండలం కట్టమూరులో విద్యార్థినులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే నే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు అన్నారు. పెద్దాపురం సభ విజయవంతం కావడంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప మళ్లీ అక్కడి నుం చే పోటీచేస్తారని సభలో ప్రకటించారు. రాత్రి 8 గంటలకు సామర్లకోటకు బయల్దేరారు.

Updated Date - 2023-02-17T02:59:17+05:30 IST