అంబులెన్స్‌ రాకపోవడంతో నడిరోడ్డుపై ప్రసవం

ABN , First Publish Date - 2023-07-03T03:17:37+05:30 IST

ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. అలాంటి ఊరి మహిళకు పురిటి నొప్పులొచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే అందుబాటులో ..

అంబులెన్స్‌ రాకపోవడంతో నడిరోడ్డుపై ప్రసవం

కంబదూరు(కళ్యాణదుర్గం), జూలై 2: ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. అలాంటి ఊరి మహిళకు పురిటి నొప్పులొచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే అందుబాటులో లేదు. గత్యంతరం లేక ఆమెను ఓ ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తీసుకొస్తుండగా.. మధ్యలోనే ప్రసవమైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మౌక్తికాపురానికి చెందిన తస్లీమ్‌ నాలుగోసారి గర్భం దాల్చింది. ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం కోసం ఫోన్‌ చేశారు. రాయదుర్గం నుంచి రావాల్సి ఉందని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చేసేది లేక తస్లీమ్‌ కుటుంబ సభ్యులు గ్రామంలోని ఓ ప్రైవేటు మినీ వ్యాన్‌ను అద్దెకు తీసుకుని కళ్యాణదుర్గం బయల్దేరారు. ధర్మవరం ప్రధాన రహదారిపై పాలవాయి-బట్టువానిపల్లి గ్రామాల మధ్యలో నొప్పులు ఎక్కువవడంతో వాహనంలో కూర్చోలేక కిందకి దిగిన ఆమె రోడ్డుపైనే ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అటుగా వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు తన కారులో బాలింతను తీసుకెళ్లి, కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో చేర్పించారు.

Updated Date - 2023-07-03T04:31:49+05:30 IST