Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు

ABN , First Publish Date - 2023-04-08T11:07:05+05:30 IST

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును..

Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు

హైదరాబాద్/సికింద్రాబాద్: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును(Vande Bharat Express train between Secunderabad and Tirupati) దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు ప్రారంభించనున్నారు. రెండు గంటలపాటు జరిగే ఈ సుడిగాలి పర్యటనలో మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలను రైల్వే అధికారులు ఖరారు చేశారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చార్జ్‎ల టెబుల్‎ను శనివారం విడుదల చేశారు. ఛైర్‌కార్‌ ఛార్జ్ రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛార్జ్ రూ.3080 ఫిక్స్ చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.1625 నిర్ణయించారు. దీంతో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది ఊరట కలిగించే విషయం. ఎందుకంటే ఇంతకుముందు లాగా..గంటల తరబడి రైలులో ప్రయాణం తప్పనుంది. దానితో పాటు టైమ్ కూడా చాలా సేవ్ కానుంది.

వందేభారత్ ఎక్కడెక్కడ ఆగుతుందంటే..

సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయి.. నల్గొండ, ఒంగోలు, నెల్లూు స్టేషన్లలో ఆల్టింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు మొదలై మధ్యాహ్నం వరకు 2.30 వరకు తిరుపతిలో చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కి స్టార్ట్ అయి రాత్రి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది.

సికింద్రాబాద్ నుంచి వివిధ స్టేషన్లకు ధరలు ఇలా..

సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470

సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270

సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు

సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900

సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455

సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080

Updated Date - 2023-04-08T11:18:30+05:30 IST