Home » Andhra Pradesh » Chittoor
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి.. ఇంతవరకు అసెంబ్లీకి రాకపోయినా.. పీఏసీ ఛైర్మన్ పదవి కావాలంటూ గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.
తిరుమల దక్షిణ మాడవీధుల్లోని గేట్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మూస్తూ, తీస్తూ అగచాట్లకు గురిచేస్తున్నారు.
జిల్లాలో మూడు ఇసుక యార్డులను లాటరీ పద్ధతి ద్వారా మూడు ఏజెన్సీలకు అప్పగించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
సైబర్ క్రైం సెల్కు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా సెల్ను మరింత పటిష్ఠ పరచడానికి చర్యలు చేపట్టారు.
తిరుపతి నగర పాలకసంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ అధికారుల అక్రమాలపై జరుగుతున్న విచారణ మూడు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైంది.
జిల్లాలో 1-12 తరగతులు చదువుతున్న విద్యార్థుల అపార్ ఐడీకి జనన ధ్రువీకరణపత్రం జారీ చేసేనిమిత్తం నోటరీ, అఫిడవిట్లు అవసరంలేకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో కేవీఎస్ కుమార్ తెలిపారు.
మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి.
విభజన తర్వాత తిరుపతి జిల్లాకు అపారమైన మత్స్య సంపద కలిసివచ్చింది. ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం వరంగా వచ్చింది. 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల పులికాట్ సరస్సులో అత్యధికభాగం జిల్లాలో భాగం అయింది.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక బహుళ శుద్ధ పంచమి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు.అలంకార మండపం వద్ద సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లకు అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు.
ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను అపహరించే కర్ణాటకకు చెందిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.