Chandrababu news: ఏసీబీ కోర్టులో మరో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమైన సీఐడీ అధికారులు... ఈసారి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-24T15:18:06+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development Case) భాగంగా ప్రస్తుతం సీఐడీ కస్టడీలో (CID Custody) ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu arrest) మరో మూడు రోజులు కస్టడీ కోరాలని సీఐడీ యోచిస్తోంది.

Chandrababu news: ఏసీబీ కోర్టులో మరో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమైన సీఐడీ అధికారులు... ఈసారి ఏంటంటే..

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development Case) భాగంగా ప్రస్తుతం సీఐడీ కస్టడీలో (CID Custody) ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu arrest) మరో మూడు రోజులు కస్టడీ కోరాలని సీఐడీ యోచిస్తోంది. ఈ మేరకు కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా నేటితో (ఆదివారం) చంద్రబాబు రిమాండ్, కస్టడీ ముగియనున్నాయి. ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చంద్రబాబును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లోనే తెలిసిపోనుంది.

ఇదిలావుండగా చంద్రబాబు రెండో విచారణ కొనసాగుతోంది. ఉదయం వైద్యపరీక్షల అనంతరం 9.30 గంటల సమయంలో అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. లంచ్‌కు ఒక గంట సమయం ఇచ్చారు. అనంతరం విచారణ పున:ప్రారంభమైంది.

Updated Date - 2023-09-24T15:18:14+05:30 IST