Coromandel Express: తిరుపతి రైల్వేస్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన
ABN , First Publish Date - 2023-06-03T18:43:06+05:30 IST
తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు.
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగిందని తెలిపారు. మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకుని, తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం మానుకోవాలని చింతామోహన్ హితవుపలికారు. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు యశ్వంత్‌పూర్ హౌరా రైలుకు తగి లాయి. దీంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 12 బోగీలు పట్టాయి. రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి.