Vishnu swami: కౌబాయ్ విష్ణు స్వామిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2023-06-11T03:50:44+05:30 IST
గలు స్వామీజీ, రాత్రి కౌబాయ్ వేషాలతో తిరిగే విష్ణు స్వామిని వెంటనే అరెస్టు చేసి, చినజీయర్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య శనివారం డిమాండ్ చేశారు.
ఏపీ హేతువాద సంఘం డిమాండ్
విజయవాడ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): పగలు స్వామీజీ, రాత్రి కౌబాయ్ వేషాలతో తిరిగే విష్ణు స్వామిని వెంటనే అరెస్టు చేసి, చినజీయర్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య శనివారం డిమాండ్ చేశారు. రెండు రాష్ర్టాల్లోనూ బాబాల వేషాలతో తిరిగే దొంగల గుట్టురట్టు చేయాలని ప్రభుత్వాల్ని కోరారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చినజీయర్, పెద్దజీయర్, స్వరూపానంద, గణపతి సచ్చిదానందల వద్దకెళ్లి సాష్టాంగపడటం ద్వారా ప్రజలకు ఏరకమైన సంకేతాలిస్తున్నారో చెప్పాలని అడిగారు. బాబాల ఆశ్రమాలన్నీ నేడు భూకుంభకోణాలు, హత్యలు, అత్యాచారాలు, నేరసామ్రాజ్యాలకు అడ్డాగా తయారయ్యాయని దుయ్యబట్టారు. రెండు రాష్ర్టాల్లోని పీఠాధిపతుల ఆశ్రమాలను వెంటనే స్వాఽధీనం చేసుకొని.. స్వాముల్ని, బాబాల్ని అరెస్టు చేయాలని కోరారు.