Deputy CM : డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పాఠశాల దుస్థితిపై విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2023-08-21T13:50:57+05:30 IST
డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో పాఠశాల దుస్థితిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెనుమూరు మండలం సన్యాసిపల్లి మండల పరిషత్ పాఠశాల కూలిపోయే స్థితిలో ఉంది.
చిత్తూరు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో పాఠశాల దుస్థితిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెనుమూరు మండలం సన్యాసిపల్లి మండల పరిషత్ పాఠశాల కూలిపోయే స్థితిలో ఉంది. పాఠశాలలోని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని, తలకి హెల్మెట్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కూలిపోయే దీన స్థితిలో ఉన్న తమ పాఠశాలపై సీఎం జగన్ మామయ్య దృష్టి పెట్టాలని విద్యార్థుల మొరపెట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాతయ్య మా పాఠశాలను బాగు చేయాలంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. మా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో పాఠశాల భవనాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.