Share News

DIG: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం

ABN , First Publish Date - 2023-10-14T18:51:47+05:30 IST

డాక్టర్ల బృందం చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. చంద్రబాబు పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

DIG: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై జైళ్లశాఖ కోస్టల్‌ ఏరియా డీఐజీ రవికిరణ్‌, ఎస్పీ జగదీష్‌, డాక్టర్ల టీమ్ మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ల బృందం చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. చంద్రబాబు పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

చంద్రబాబు శరీరంపై దద్దుర్లు ఉన్నాయని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారని చెప్పారు. వైద్యులు ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, చల్లని వాతావరణం ఏర్పాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని అధికారులు పేర్కొన్నారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం అందించాలని చంద్రబాబు సూచించారని జైలు అధికారులు చెప్పారు.

"వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతాం. చంద్రబాబుకు 24 గంటలు వైద్యం అందిస్తాం. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడారు. ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తాం. జైలుకు వచ్చినప్పుడు వాతావరణం మారుతుంది. ఇంటి వద్ద వాతావరణానికి భిన్నంగా ఉంటుంది." అని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు.

WhatsApp Image 2023-10-14 at 8.47.30 PM.jpeg

Updated Date - 2023-10-14T21:33:56+05:30 IST