ఓఎన్జీసీ జీజీఎస్‌లో మంటలు
ABN , First Publish Date - 2023-06-17T05:45:26+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలోని కేశనపల్లి జీజీఎస్‌లో గ్యాస్ పైపులైను
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలోని కేశనపల్లి జీజీఎస్‌లో గ్యాస్ పైపులైను నుంచి శుక్రవారం మంటలు చెలరేగాయి. ఇక్కడ పనికిరాని క్రూడాయిల్‌ను, గ్యాస్‌ను నిత్యం మండిస్తారు. ఈ రెండు పైపులైన్లు పక్కపక్కనే ఉంటాయి. గ్యాస్ స్వల్పంగా లీకవ్వడంతో క్రూడాయిల్ నుంచి వచ్చే మంటలు పైకి ఎగిసి పైపులైనుపై నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమీపంలోని ఇళ్ల నుంచి ప్రజలు దూరంగా వెళ్లిపోయారు. ఓఎన్జీసీకి చెందిన నాలుగు ఫైర్ ఇంజన్లతో 15 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
- మలికిపురం