వైభవంగా ఆంజనేయస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2023-04-25T23:36:34+05:30 IST

మండలపరిధిలోని తవళం గ్రామం వద్ద పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన తవళం ఆం జనేయస్వామి రథోత్సవాన్ని (తేరు) మంగళవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఆంజనేయస్వామి రథోత్సవం

తనకల్లు, ఏప్రిల్‌ 25: మండలపరిధిలోని తవళం గ్రామం వద్ద పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన తవళం ఆం జనేయస్వామి రథోత్సవాన్ని (తేరు) మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేకంగా అలంకరించన రథంలో స్వామి ఉత్సవ విగ్రాహాన్ని కొలువుదీర్చారు. ఉదయం 8.30గంటలకు బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛారణ నడుమ రథోత్సవం ప్రారంభమైంది. హరినామస్మరణ, జయజయ ధ్వానాల తో ఆలయం ప్రాంగణం మార్మోగింది. మండలం నుంచే కాకుండా అన్నమ య్య జిల్లాలోని మొలకలచెరువు, తంబళ్లపల్లి, బీ కొత్తకోట, కర్ణాటకలోని చేలూరు, బిళ్లూరు చాకివేలునుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

రేపట్నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

ధర్మవరం, ఏప్రిల్‌ 25: స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 27 నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన, పాలకవర్గ సభ్యులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. 27న ధ్వజారోహణం, 28న ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనం నిర్వమిస్తామన్నారు. 29న ఉదయం సర్వభూపాల వాహనం, సా యంత్రం సింహవాహనం, 30న ఉదయం కల్పవృక్షవాహనం, సాయంత్రం హనుమద్వాహనం, మే 1న ఉదయం పుష్పమండపం, సాయంత్రం కల్యాణోత్సవం జరుగుతాయన్నారు. 2న సాయంత్రం 3గంటలకు శేషవాహ నం, 6గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తామన్నారు. 3న ఉదయం మడుగు తేరు సాయంత్రం 4గంటలకు బ్రహ్మరథోత్సవం, 6గంటలకు ధూళోత్సవం ఉంటాయన్నారు. 4న సాయంత్రం 6గంటలకు అశ్వవాహనం, 5న ఉదయం పుష్పమండపం, 10గంటలకు వసంతోత్సవం, సాయంత్రం 6గంటలకు హంసవాహనం, 6న సాయంత్రం దేవతా ఉద్వాసన, 7న ఉదయం 9గంటలకు పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

29 నుంచి సంగమేశ్వరస్వామి ఉత్సవాలు

కొత్తచెరువు, ఏప్రిల్‌ 25: మండల కేంద్రంలోని సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 29న ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్తలు మనోహర్‌, నటరాజ్‌, నాగేంద్రప్రసాద్‌, ఫణీంద్రమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 29న గురువారం 6గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 30న హంసవాహనం, మే 1న భృంగివాహనం, 2న శేషవాహనం, 3న నందివాహనం, 4న కల్యాణోత్సవం, 5న స్వామివారి రథోత్సవం ఉంటాయన్నారు. 6న 7 గంటలకు పార్వేటోత్సవం, 7న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

Updated Date - 2023-04-25T23:36:34+05:30 IST