తెలంగాణ విభిన్న సంస్కృతుల సమ్మేళనం: గవర్నర్‌

ABN , First Publish Date - 2023-06-03T04:51:10+05:30 IST

‘‘ఏక్‌ భారత్‌ – శ్రేష్ఠ్‌ భారత్‌’’ కార్యక్రమం దేశ ప్రజల మధ్య బలమైన బంధాన్ని నెలకొల్పుతుందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో తెలంగాణ రాష్ట్ర

తెలంగాణ విభిన్న సంస్కృతుల సమ్మేళనం: గవర్నర్‌
రాజ్‌భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏక్‌ భారత్‌ – శ్రేష్ఠ్‌ భారత్‌’’ కార్యక్రమం దేశ ప్రజల మధ్య బలమైన బంధాన్ని నెలకొల్పుతుందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం విభిన్న భాషలు, సంస్కృతలకు సమ్మేళనమైన ప్రదేశమని కొనియాడారు. జాతీయ సమైక్య స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఏక్‌ భారత్‌ – శ్రేష్ఠ్‌ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు.

Updated Date - 2023-06-03T04:51:10+05:30 IST