జగన్‌ చెబితే పవన్‌పై పోటీకి సిద్ధం

ABN , First Publish Date - 2023-01-18T03:58:44+05:30 IST

సీఎం జగన్‌ చెబితే జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని సినీ నటుడు ఆలీ చెప్పారు.

జగన్‌ చెబితే పవన్‌పై పోటీకి సిద్ధం

డైమండ్‌ రాణి అంటే పొగిడినట్లే: ఆలీ

నగరి, జనవరి 17: సీఎం జగన్‌ చెబితే జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని సినీ నటుడు ఆలీ చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా ఇంటికి మంగళవారం వచ్చిన ఆయన.. డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ మీ మిత్రుడే కదా..! ఆయనపై పోటీ చేస్తారా?’ అన్న మీడియా ప్రశ్నకు ఆలీ పైవిధంగా స్పందించారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ మిత్రుడైనా రాజకీయం వేరు. కుటుంబం, స్నేహం, రాజకీయాలు వేర్వేరు. రాష్ట్రంలోని 175 సీట్లలో వైసీపీ గెలవడం ఖాయం. డైమండ్‌ విలువైంది. లండన్‌లో నేటికీ కోహినూర్‌ వజ్రం అంటే మంచి పేరుంది. రోజాను డైమండ్‌ రాణి అని అనడమంటే ఆమె గొప్పతనాన్ని పొగిడినట్లే తప్ప విమర్శించినట్లు కాదు’’ అని ఆలీ అన్నారు.

Updated Date - 2023-01-18T04:09:12+05:30 IST