వర్మ వస్తే గుండు కొట్టిస్తాం
ABN , First Publish Date - 2023-03-17T04:33:55+05:30 IST
‘‘నచ్చింది తిని, తాగి ఎంజాయ్ చేయండి. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చు... కాబట్టి బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి’’ అంటూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఆర్జీవీ వ్యాఖ్యలపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
పెదకాకాని, మార్చి 16: ‘‘నచ్చింది తిని, తాగి ఎంజాయ్ చేయండి. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చు... కాబట్టి బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి’’ అంటూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో.. మహిళలు, విద్యార్థుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. టీఎన్‌ఎ్‌సఎఫ్, ఏబీవీపీ నాయకులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట గురువారం వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. టీఎన్‌ఎ్‌సఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీ మాట్లాడుతూ.. ఆర్జీవి మరోసారి ఏపీలో అడుగుపెడితే గుండు కొట్టిస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ నాయకులు సాయి మాట్లాడుతూ.. వర్మను వర్సిటీకి ఆహ్వానించడమే పెద్ద తప్పని పేర్కొన్నారు. గుంటూరులో ఎన్‌ఎ్‌సయూ ఆధ్వర్యంలో గురువారం వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడుతూ.. మహిళలను కించపరచటమే కాక యువతను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
వీసీ వింత వివరణ
విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచ నలను పెంచేందుకే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను ఆహ్వానించిన ట్టు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాల యం ఉపకులపతి ఆచార్య పి.రాజ శేఖర్ పేర్కొన్నారు. వర్మను సృజనా త్మకత ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆహ్వానించామని, కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడతారనే విష యంతో తమకు సంబంధం లేదని వింత వివరణ ఇచ్చారు. అయితే ఆర్జీవీ మాట్లాడే టప్పుడు పక్కనే ఉన్న వీసీ ఆయన వ్యాఖ్యలను ఖండించకపోగా.. ప్రసంగం పూర్త య్యాక పొగడ్తలతో ముంచె త్తడం గమనార్హం.