NTR Dist: మైలవరంలో మట్టి అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు
ABN , First Publish Date - 2023-11-12T10:16:09+05:30 IST
మట్టి అక్రమ(Soil illegal Transport) రవాణా చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకోవడంతో ఎన్టీఆర్ జిల్లా(NTR Dist)లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మైలవరం: మట్టి అక్రమ(Soil illegal Transport) రవాణా చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకోవడంతో ఎన్టీఆర్ జిల్లా(NTR Dist)లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం పుల్లూరు గ్రామం నుంచి మైలవరం చిన్న హరిజనవాడ సమీపంలోని కుంటముక్కల రోడ్డులో గల ఇటుక బట్టీలకు మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి పుల్లూరులో మట్టి అక్రమ రవాణా జరుగుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి కొన్ని లారీలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.