ఘనంగా పండిత సదస్యం
ABN , First Publish Date - 2023-06-02T00:57:08+05:30 IST
అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం పండిత సదస్యం ఘనంగా జరిగింది. గురువారం స్వామివారికి సుప్రభా తసేవ, నిత్యార్చన, సహస్ర నామార్చన, బాలభోగ నివే దన, నిత్య హోమం, బలిహరణం, తీర్థ ప్రసాద గోష్ఠి, చతుస్థానార్చాన, హోమం తదితర పూజా కార్యక్రమా లతో పాటు వేద పారాయణం నిర్వహించారు.
మామిడికుదురు, జూన్ 1: అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం పండిత సదస్యం ఘనంగా జరిగింది. గురువారం స్వామివారికి సుప్రభా తసేవ, నిత్యార్చన, సహస్ర నామార్చన, బాలభోగ నివే దన, నిత్య హోమం, బలిహరణం, తీర్థ ప్రసాద గోష్ఠి, చతుస్థానార్చాన, హోమం తదితర పూజా కార్యక్రమా లతో పాటు వేద పారాయణం నిర్వహించారు. సాంస్కృ తిక కార్యక్రమాల్లో భాగంగా అన్నసమాచార్య సంకీర్తనా విభావరి, పురందాసు కీర్తనలు, శ్రీరామాంజనేయ భక్త బృందం భజన కార్యక్రమం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమాలన్నీ సహాయ కమిషనర్ డి.శ్రీరామవరప్రసాదరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ చిట్టూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమాల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.