Lokesh Padayatra: లోకేశ్ సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరికలు

ABN , First Publish Date - 2023-03-15T19:45:48+05:30 IST

టీడీపీ నేత నారా లోకేశ్ (NaraLokesh) ప్రారంభించిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)కు విశేష స్పందన వస్తోంది.

Lokesh Padayatra: లోకేశ్ సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరికలు

మదనపల్లె: టీడీపీ నేత నారా లోకేశ్ (NaraLokesh) ప్రారంభించిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)కు విశేష స్పందన వస్తోంది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆధ్వర్యంలో 300 మందికిపైగా ముస్లిం మైనారిటీలు నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. వాళ్లందరికీ లోకేశ్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాదయాత్ర (Padayatra)లో గట్టు గ్రామానికి చెందిన పలువురు దళితులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. పాదయాత్ర కొనసాగినంత దూరం పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొని లోకేశ్‌కు నీరాజనం పలికారు. బి.కొత్తకోటలో టీడీపీ (TDP) కార్యకర్తలు, నాయకులు పూలమాలలు, బాణాసంచా, డప్పులతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. మాజీ జడ్జి రామకృష్ణ పాదయాత్రలో పాల్గొని లోకేశ్‌కు సంఘీభావం తెలిపారు. బి.కొత్తకోటలో పలువురు ప్రజలు రోడ్లపైకి వచ్చి లోకేశ్‌తో తమ సమస్యలు చెప్పుకున్నారు.

మైనారిటీలపై పెరిగిన దాడులు

ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. చిన్నాన్నను చంపిన వ్యక్తి తరపున ప్రభుత్వ లాయర్‌లను పెడుతున్నారు గానీ ముస్లిం రిజర్వేషన్‌ కోసం మాత్రం జగన్‌ పోరాడడం లేదు. మేము అధికారంలోకి వస్తే అన్ని విధాలా ముస్లింలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.

పెద్దిరెడ్డి కుటుంబం అక్రమాలకు అంతే లేదు

మంత్రి పాపాల పెద్దిరెడ్డి (Peddireddy) కుటుంబం అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. కుప్పం, పలమనేరు (Kuppam Palamaneru) నియోజకవర్గాలకు పరిశ్రమలు వస్తున్నాయి కానీ, తంబళ్లపల్లెకు రాలేదు. దీనికి కారణం పాపాల పెద్దిరెడ్డి కుటుంబమే. పరిశ్రమలు పెట్టాలంటే వాటా ఎంతిస్తారని అడుగుతుండడంతో పారిశ్రామికవేత్తలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. పాపాల పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించకపోతే నియోజకవర్గ ప్రజలు పేదరికంలోనే జీవించాల్సి ఉంటుంది. లారీలు, డైరీలు, జేసీబీలు, ట్రాక్టర్లు, క్వారీలు... ఏవి చూసినా పెద్దిరెడ్డి కుటుంబానివే ఉన్నాయి. గత నాలుగేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం రూ.10 వేల కోట్లను దోచుకుంది. ఇది నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. పెద్దిరెడ్డి పాపాలు, ముఖ్యమంత్రికి కనబడడం లేదు. రూ.1500 కోట్లతో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారైనా జగన్‌ ఇక్కడికి వచ్చారా? అని లోకేశ్ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-15T19:45:48+05:30 IST