రాయలసీమలో పెరిగిన చలి

ABN , First Publish Date - 2023-01-11T21:25:35+05:30 IST

పొడిగాలుల ప్రభావంతో బుధవారం రాయలసీమలో చలి పెరిగింది. పొరుగునున్న ఉత్తర కర్ణాటకలో తీవ్రమైన చలిగాలులు వీస్తుండడంతో ఆ ప్రభావం రాయలసీమ (Rayalaseema)పై పడింది.

రాయలసీమలో పెరిగిన చలి

విశాఖపట్నం: పొడిగాలుల ప్రభావంతో బుధవారం రాయలసీమలో చలి పెరిగింది. పొరుగునున్న ఉత్తర కర్ణాటకలో తీవ్రమైన చలిగాలులు వీస్తుండడంతో ఆ ప్రభావం రాయలసీమ (Rayalaseema)పై పడింది. గడచిన రెండు రోజుల నుంచి రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. బుధవారం అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) జిల్లా అరకులోయలో 3.8 డిగ్రీలు నమోదుకాగా రాయలసీమలోని ఆరోగ్యవరంలో 11.5 డిగ్రీలు నమోదయ్యింది. రానున్న రెండు, మూడు రోజుల్లో చలి స్వల్పంగా తగ్గి, ఈనెల 16వ తేదీ తరువాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Updated Date - 2023-01-11T21:25:37+05:30 IST