సీబీఐ విచారణ తీరు ప్రజలందరికీ తెలియాలి
ABN , First Publish Date - 2023-04-28T02:44:48+05:30 IST
వివేకా హత్య కేసులో సీబీఐ జరుపుతున్న విచారణ ప్రజలందరికీ తెలియాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి అన్నారు.
వీడియో విడుదల చేసిన ఎంపీ అవినాశ్
కడప, ఏప్రిల్ 27 (ఆంరఽధజ్యోతి): వివేకా హత్య కేసులో సీబీఐ జరుపుతున్న విచారణ ప్రజలందరికీ తెలియాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి అన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి.. చంద్రబాబుతో, ఎల్లో మీడియాతో కుమ్మక్కయ్యారని.. తన తండ్రిని చంపిన వ్యక్తి(దస్తగిరి)ని అప్రూవర్‌గా ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. తనను, తన తండ్రిని ఇరికించడమే ఆమె ఽధ్యేయమని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో విడుదల చేశారు. సీబీఐ విచారణ జరుగుతున్న తీరు ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే దీనిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో సీబీఐ విచారణతో పాటు చాలా రాజకీయాలు తిరుగుతున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణకు రెండుసార్లు హాజరైన తర్వాత.. వాళ్లు తప్పుదోవలో వెళ్తున్నారని స్పష్టంగా అర్థమయ్యాక.. ఇప్పటివరకు తనకు తెలిసిన వాస్తవాలు స్పష్టంగా తెలియజేసేందుకు వీడియో రూపొందించినట్లు తెలిపారు. ‘దస్తగిరి సహా నలుగురు వివేకానందరెడ్డిని కొట్టడాన్ని, చంపడాన్ని కళ్లారా చూశానని వాచ్‌మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్పష్టంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత.. వారిలో ఒకరిని అప్రూవర్‌గా మార్చాల్సిన ఆవశ్యకత ఉందా అనేది ఆలోచించాలి. అతను డబ్బు కోసం ఒకరిని చంపే నైజం ఉన్న వ్యక్తి. అదే డబ్బుకోసం కేరక్టర్ మార్చుకోడన్న గ్యారెంటీ ఏమిటి? చేతిమీద నరికింది, బలవంతంగా లెటర్ రాయించింది నేనేనని చెప్పాడు. ఆ వ్యక్తిని అప్రూవర్‌గా చేయడం తేడాగానే కనిపిస్తుంది. సునీతమ్మ నన్ను గానీ, మా నాన్నను గానీ ఎందుకు టార్గెట్ చేయాలనుకుంది? ఎందుకు ఎల్లో మీడియాతో చేతులు కలిపింది? మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి)తో రోజూ ఎందుకు ఫోనులో సంభాషిస్తారు? చంద్రబాబుతో ఎందుకు టచ్‌లో ఉంటున్నారు? రఘురామ, ఆదినారాయణరెడ్డి వంటి వాళ్లతో ఎందుకు టచ్‌లో ఉన్నారు? వారితో చేతులు కలిపారంటే నన్ను, మా నాన్నను ఇరికించడం మీ ధ్యేయం. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు వైసీపీని డీఫేమ్ చేస్తున్నాడు. సంవత్సరం కితం సీబీఐ డైరెక్టర్‌కు రిప్రజెంటేషన్‌ఇచ్చా. మళ్లీ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను కలిసినపుడు ఇచ్చా..’ అని అవినాశ్‌రెడ్డి తెలిపారు.