Kesineni Nani : బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నేను చెయ్యను
ABN , First Publish Date - 2023-05-22T13:04:59+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఔదార్యం ప్రదర్శించారు. పేదవానికి ఉచితంగా సి.యన్.జి ఆటోను బహూకరించారు. దానిని ఎంపీ కేశినేని నాని చేతుల మీదుగా అందజేశారు. ఆ తరువాత ఆటోలో కేశినేని నాని కొద్ది దూరం ప్రయాణించి వచ్చారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు.
విజయవాడ : జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఔదార్యం ప్రదర్శించారు. పేదవానికి ఉచితంగా సి.యన్.జి ఆటోను బహూకరించారు. దానిని ఎంపీ కేశినేని నాని చేతుల మీదుగా అందజేశారు. ఆ తరువాత ఆటోలో కేశినేని నాని కొద్ది దూరం ప్రయాణించి వచ్చారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా తనకు తెలుసన్నారు. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానన్నారు. తనకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళని పేర్కొన్నారు. ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తాను చేయబోనన్నారు. బెజవాడ పార్లమెంట్‌కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానన్నారు. ఇంకా కేశినేని నాని మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతానని కేసీఆర్ అన్నారు. నేను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తాను. ఎంపీగా ఉన్న నేను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే.. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు సహకరించాలి. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయ భాను , మొండి తోక సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నాను. అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు.