Viveka Case: వివేకా కేసులో సీబీఐ తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు ఇవే..

ABN , First Publish Date - 2023-05-03T16:55:46+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై..

Viveka Case: వివేకా కేసులో సీబీఐ తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు ఇవే..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టు (High Court)లో సీబీఐ కౌంటర్ వేసింది. సీబీఐ (CBI) కౌంటరులో వివేకా హత్య దర్యాప్తుపై కీలక వివరాలు వెల్లడించింది. అవినాశ్ను అరెస్ట్ చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ర్యాలీలు జరపడం.. సాక్షులను ప్రభావితం చేయడమేనని సీబీఐ పేర్కొంది. హత్యాస్థలిలో ఆధారాలు చెరిపివేయడం కుట్రలో భాగమేనని, గొడ్డలి ఎక్కడుందో కస్టడీ విచారణలో తెలుసుకోవాలని కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ ప్రస్తావించింది.

‘‘హత్యకు రూ.4 కోట్ల లావాదేవీలపై అవినాశ్ రెడ్డి విచారణలో తేల్చాలి. సునీల్ యాదవ్‌తో అవినాశ్ రెడ్డికి సంబంధమేంటో తెలియాలి. హత్య రోజున అవినాశ్ ఇంటికి సునీల్ ఎందుకెళ్లాడో తేల్చాలి. హత్య కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకోవాలి. మార్చి 15న అవినాశ్ రెడ్డి ఎక్కడెక్కడున్నారో నిర్ధారించాలి. నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు.. ఇస్తామన్నారని గంగాధర్రెడ్డి అన్నారు. గంగాధర్రెడ్డి వాంగ్మూలంలో వాస్తవం తేల్చాలి. దస్తగిరిని ఓబుల్ రెడ్డి, భరత్ యాదవ్ ఎందుకు కలిశారో తేలాలి. అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలానికి సాక్షులు ముందుకు రావట్లేదు. అవినాశ్ అనుచరుల వల్ల దర్యాప్తునకు ఆటంకం కలిగింది. అవినాశ్ రెడ్డి దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. అవినాశ్ రెడ్డికి నేర చరిత్ర ఉంది, 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవినాశ్ సాక్షులను ప్రభావితం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య, గంగాధర్ రెడ్డి ప్రభావితమైనట్లు కనిపిస్తోంది’’ అని హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

Updated Date - 2023-05-03T16:55:46+05:30 IST