బాబును విడుదల చేయాలి: కోమటి జయరాం

ABN , First Publish Date - 2023-09-25T04:22:03+05:30 IST

రాజకీయ కక్షతో అక్రమంగా అరెస్ట్‌ చేసిన చంద్రబాబును ప్రభుత్వం భేషరతుగా, వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఎన్నారై యూఎ్‌సఏ

బాబును విడుదల చేయాలి: కోమటి జయరాం

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్షతో అక్రమంగా అరెస్ట్‌ చేసిన చంద్రబాబును ప్రభుత్వం భేషరతుగా, వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఎన్నారై యూఎ్‌సఏ సమన్వయకర్త కోమటి జయరాం డిమాండ్‌ చేశారు. ఏపీని అధోగతి పాలు చేసిన జగన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తెలుగు వారంతా తరిమికొట్టడం ఖాయమన్నారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమకు ఉపాధి కల్పించిన నాయకుడు అక్రమ అరె్‌స్టతో జైలు శిక్ష అనుభవిస్తుంటే.. ఆయనకు మద్దతుగా చేపట్టిన కార్ల ర్యాలీని అడ్డుకుంటారా? ఎన్నారైలందరూ చంద్రబాబుకు అండ గా ఉంటారు. చంద్రబాబు అరెస్టే వైసీపీ పతనానికి నాంది’’ అని తెలిపారు.

Updated Date - 2023-09-25T04:22:03+05:30 IST