పంచాయతీ వ్యవస్థను కాపాడుకుందాం: వైవీబీ
ABN , First Publish Date - 2023-11-30T03:38:12+05:30 IST
గ్రామ స్వరాజ్యానికి కారణమైన పంచాయతీ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దానిని కాపాడుకుని పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గ్రామ స్వరాజ్యానికి కారణమైన పంచాయతీ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దానిని కాపాడుకుని పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. బుధవారం ఏపీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు లక్ష్మీ ముత్యాలరావుతో కలిపి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను, అధికారాలను హైజాక్ చేసిందని, ఈ నిరంకుశ పాలన ప్రారంభమయ్యాక 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని, మనం ఇంకా ఉపేక్షిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని తెలిపారు. ఇకనైనా సర్పంచ్‌లందరూ పార్టీలకతీతంగా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు.