fire hazard : తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2023-06-17T05:17:31+05:30 IST

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమా దం సంభవించింది. ఫొటో ల్యామినేషన్‌ సంస్థ

 fire hazard : తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఘటన

తిరుపతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమా దం సంభవించింది. ఫొటో ల్యామినేషన్‌ సంస్థ లావణ్య షాపు లో ఉదయం 11గంటలకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంట లు వ్యాపించి భవంతి మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. ఆల య పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేశారు. ఒకదశలో మంటలు ఆలయ మహారథం వైపు వ్యాపించగా, టీటీడీ సిబ్బంది, స్థానికుల సహకారంతో రథంపై నీళ్లు చల్లుతూ రథాన్ని దూరంగా జరపాల్సివచ్చింది. గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. మొత్తం 7 ఫైర్‌ ఇంజన్లు 3 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు. లావణ్య సంస్థ దాదాపు రూ.25 కోట్లు నష్టపోయినట్టు ఫైర్‌ అధికారులు ప్రాఽథమికంగా అంచనాకు వచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పరిశీలించారు.

Updated Date - 2023-06-17T05:17:31+05:30 IST