సొమ్మొకరిది.. సోకొకరిదా!?
ABN , First Publish Date - 2023-10-23T02:19:08+05:30 IST
‘‘వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వాటిని వినియోగించుకుంటున్న జగన్ ప్రభుత్వం.. అంతా తామే చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం సహకారం ఉన్న ప్రతి పథకంలో
మోదీ ఫొటో వేయకపోతే నిధులు ఆపేస్తాం
జగన్ సర్కారు తీరుపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఫైర్
తిరుపతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వాటిని వినియోగించుకుంటున్న జగన్ ప్రభుత్వం.. అంతా తామే చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం సహకారం ఉన్న ప్రతి పథకంలో మోదీ ఫొటో వేయాలి. లేకుంటే నిధులు ఆపేస్తాం. సొమ్ము ఒకరిది.. సోకొకరిది అన్న చందంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడంలేదు. వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తగ్గించాలి. ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో అధిక శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానివే. వైసీపీ నేతల మోసపూరిత మాటలను నమ్మకండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని చెప్పారు.