దళితులపై పోలీసు జులుం

ABN , First Publish Date - 2023-06-14T03:32:06+05:30 IST

దళితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడలోని పెరుగులంక దళితుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

దళితులపై పోలీసు జులుం

‘పశ్చిమ’ చించినాడలో పోలీసుల అతి

ఎమ్మెల్యే నిమ్మల, సీపీఎం శ్రీనివాసరావు అరెస్ట్‌

భీమవరం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): దళితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడలోని పెరుగులంక దళితుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జగనన్న ఇళ్లకు మట్టి తరలింపు పేరుతో యథేచ్ఛగా వైసీపీ నాయకులు అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై వారం రోజులుగా దళితులతో కలిసి అఖిలపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం చించినాడలో దళితులు, టీడీపీ, వామపక్షాలు, జనసేన నేతలు నిర్వహించిన సభ ఉద్రిక్తతకు దారితీసింది. సభ ముగిసిన తర్వాత పెరుగులంక భూములను పరిశీలించేందుకు నాయకులు, దళితులు పయనమయ్యారు.

9tpg3.jpg

వందలాదిగా పోలీసులు చుట్టుముట్టి వారిని అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగడంతో పోలీసులు చెలరేగిపోయారు. దళితులను, టీడీపీ, జనసేన, వామపక్ష నాయకులను ఈడ్చివేయగా, కొందరు కిందపడి గాయాలపాలయ్యారు. నిమ్మల, శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంను అదుపులోకి తీసుకొని చించినాడ నుంచి ఆచంట, మార్టేరు మీదుగా తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా.. ప్రతిచోటా టీడీపీ, వామపక్ష నాయకులు అడ్డుతగిలారు. తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అరెస్టయిన నాయకులను సాయంత్రం విడిచిపెట్టారు.

Updated Date - 2023-06-14T04:10:15+05:30 IST