సంగీత దర్శకుడు రఘు కుంచెకు పితృవియోగం

ABN , First Publish Date - 2023-01-18T03:44:06+05:30 IST

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచెకు పితృవియోగం సంభవించింది.

సంగీత దర్శకుడు రఘు కుంచెకు పితృవియోగం

కోరుకొండ, జనవరి 17: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచెకు పితృవియోగం సంభవించింది. ఆయన తండ్రి కుంచె లక్ష్మీనారాయణ(94) తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో మంగళవారం మృతిచెందారు. ఏటా సంక్రాంతికి రఘు స్వగ్రామం గాదరాడలో తండ్రిని చూడడానికి వస్తారు. అలాగే సోమవారం ఆయన హైదరాబాద్‌ నుంచి వచ్చారు. తండ్రితో రోజం తా సరదాగా గడిపారు. తదుపరి అల్పాహారం తీసుకున్న లక్ష్మీనారాయణ భగవద్గీత చదువుతూ పరమపదించారు.

Updated Date - 2023-01-18T03:44:07+05:30 IST